”గబ్బర్‌సింగ్ 3”- డైరెక్టర్ స్టోరీతో రెడీ!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్‌సింగ్’ చిత్రంతో తిరుగులేని హీరోగా బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపించాడు.
ఆ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా పవన్ అభిమాని కావడంతో, ఆ సినిమాతో అభిమానిగా తన ప్రతాపం మొత్తం చూపించాడు. పవన్ అభిమానులకు ఫుల్ మీల్స్‌ని ఆ చిత్రంతో అందించాడు హరీష్. ఆ చిత్రం ఇచ్చిన విజయంతో పవన్ కూడా గబ్బర్‌పై మమకారాన్ని పెంచుకుని, ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చేశాడు. ఆ చిత్ర రిజల్ట్ సంగతి ప్రక్కన పెడితే, గబ్బర్‌సింగ్‌ సిరీస్‌తో మరో పార్ట్ వస్తుందని ఆ సినిమా చివరిలో ‘రాజా సర్దార్ గబ్బర్‌సింగ్’ అంటూ చిన్న హింట్ ఇచ్చారు. మరి ఇదే అదనుగా అనుకున్నాడో, లేక పవన్‌కి సరిపడా మరో కథ ఏదైనా తయారు చేసుకున్నాడో తెలియదు కానీ, పవన్ అపాయింట్‌మెంట్ కోసం హరీష్ వేచి చూస్తున్నాడని మాత్రం తాజాగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
హరీష్ సన్నిహితులు తెలుపుతున్న ప్రకారం హరీష్ అద్భుతమైన కథని పవన్‌కి రెడీ చేశాడని చెబుతున్నారు. అది ‘గబ్బర్‌సింగ్ 3’గా తెరకెక్కుతుందా లేక మరో టైటిల్‌తో వస్తుందా అనేది ప్రక్కన పెడితే, ముందు ఈ సినిమా చేయడానికి పవన్ రెడీగా ఉండాలి కదా! అనే కామెంట్స్ కూడా వినవస్తున్నాయి. అక్టోబరు నుండి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానని పవన్ చెప్పిన విషయంతో పాటు, ప్రస్తుతం అతను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న మూవీ తర్వాత మరో సినిమాకి కమిట్ అయినట్లుగా అయితే వార్తలు రాలేదు. మరి ఇలాంటి టైమ్‌లో ఎంత మంచి కథ అయినా పవన్ చేస్తాడని హరీష్ అనుకోవడం అత్యాశే అవుతుందని హరీష్‌ గురించి అనుకుంటున్నారు.

Leave a Reply

Social media & sharing icons powered by UltimatelySocial