గర్భిణీలకు సామూహిక సీమంతాలు

హైరాబాబాద్: నగరంలోని చంపాపేట్ లోగల సామా నర్సింహారెడ్డి గార్డెన్‌లో శనివారం గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… నేడు ప్రభుత్వాసుపత్రుల్లో అనేక సౌకర్యాలను ప్రభుత్వం మెరుగుపరిచిందని, గర్భిణీలందరూ ప్రభుత్వ వైద్యశాలల్లోనే ప్రసవం చేయించుకొని కేసీఆర్ కిట్ పొందాలన్నారు.

Leave a Reply

Social media & sharing icons powered by UltimatelySocial