యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడు రౌడీయిజం

హైదరాబాద్: ప్రజలకు న్యాయం చేయాల్సిన ప్రజాప్రతినిధులు అన్యాయాలకు పాల్పడుతున్నారు. బాధితులు న్యాయం చేయమని కోరితే బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో బాధితుల లబోదిబోమంటున్నారు. నగరంలోని యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడు రౌడీయిజం చెలాయించాడు. కృష్ణానగర్‌లో భవన యజమానిపై కార్పొరేటర్ తమ్ముడు వంశీ జులుం ప్రదర్శించాడు. ఇంటి యజమానికి వంశీ 15 నెలలుగా అద్దె చెల్లించడం లేదని యజమాని వాపోతున్నాడు. అద్దె చెల్లించాలని కోరితే బాదితుడిపై బెదిరింపులకు దిగుతున్నాడు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో భవనాన్ని కబ్జా చేసేందుకు యత్నించాడని ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
 
 
గతంలో ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌లో జరిగింది. రెడ్‌హిల్స్ అపార్ట్‌మెంట్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఫరూఖ్ హూస్సేన్ ఆరు ఏళ్లుగా అద్దెకు ఉంటున్నారు. ప్లాట్ ఖాళీ చేయమని రెండేళ్లుగా ఇంటి యజమానురాలు చెబుతున్నా ఆయన వినడం లేదు. ఇళ్లు ఖాళీ చేయాలని అడిగినందుకు ఫరూఖ్ హూస్సేన్ తనను చెప్పుతో కొట్టారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫారూక్ హైస్సేన్ ఇంటి ఎదుట ఆందోళన చేసింది. తనకు న్యాయం చేయాలని నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది

Leave a Reply

Social media & sharing icons powered by UltimatelySocial