వైఎస్ జగన్ సీఎం అయితే…: సోమిరెడ్డి

కడప: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయని మంత్రి సోమిరెడ్డి జోస్యం చెప్పారు. శనివారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి.. అదే జగన్ సీఎం అయితే ఆయన సొంత ఆస్తులు పెరుగుతాయని చెప్పుకొచ్చారు. ప్యారడైజ్ పత్రిక నల్లకుబేరుల జాబితాలో జగన్‌ పేరు ఉందని మంత్రి తెలిపారు. కేవలం జగన్‌ కారణంగానే ఏపీని విదేశాల్లో అవినీతి రాష్ట్రమని అంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆ మచ్చను పోగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి సోమిరెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Social media & sharing icons powered by UltimatelySocial