సంబరాలు చేసుకున్న టీడీపీ కార్యకర్తలు

అనంతపురం: ఏపీ శాసనసభ, శాసనమండలిలో పదవుల భర్తీ శనివారం పూర్తైన విషయం తెలిసిందే. అసెంబ్లీ చీఫ్ విప్ రేసులో ఉన్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని ఎట్టకేలకు పదవి వరించింది. దీంతో ఆయన సొంతూరు, నియోజకవర్గంలోని ప్రజలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఆయన్ను చీఫ్‌ విప్‌గా నియమించడం పట్ల కొత్తచెరువులో టీడీపీ కార్యకర్తల సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పల్లె.. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆయనకు పార్టీ కార్యకర్తలు స్వీట్లు తినిపించారు.

Leave a Reply

Social media & sharing icons powered by UltimatelySocial