Flash News

Latest News

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న అధికారులు

November 11, 2017

విజయవాడ: విజయవాడ నుండి నూజివీడుకి అక్రమంగా తరలిస్తున్న 30 కింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దాడి చేశామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. వన్ టౌన్ పంజా సెంటర్లో బియ్యం తో ఉన్న మిని లారీని స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు వివరించారు.

Read More

కరెంట్‌షాక్‌తో యువరైతు మృతి

November 11, 2017

గుంటూరు: జిల్లాలోని  క్రోసూరు మండలం దొడ్లేరులో పొలంలో కరెంట్‌షాక్‌తో యువరైతు కోటిరెడ్డి(35) అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.   

Read More

లంచం తీసుకుంటూ దొరికిన ఎస్కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌

November 11, 2017

రాజమండ్రి: ఏసీబీకి చిక్కిన ఎస్కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ వెంకటస్వామి ఓ లాడ్జిలో అనకాపల్లి డిగ్రీ కాలేజీ కోఆర్డినేటర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు

Read More

వైఎస్ జగన్ సీఎం అయితే…: సోమిరెడ్డి

November 11, 2017

కడప: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయని మంత్రి సోమిరెడ్డి జోస్యం చెప్పారు. శనివారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి.. అదే జగన్ సీఎం అయితే ఆయన సొంత ఆస్తులు పెరుగుతాయని చెప్పుకొచ్చారు. ప్యారడైజ్ పత్రిక నల్లకుబేరుల జాబితాలో జగన్‌ పేరు ఉందని మంత్రి తెలిపారు. కేవలం జగన్‌ కారణంగానే ఏపీని విదేశాల్లో అవినీతి రాష్ట్రమని అంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆ […]

Read More

కడప జిల్లా కొత్తపల్లె చెక్‌పోస్టు దగ్గర ఏసీబీ తనిఖీలు

November 11, 2017

కడప: జిల్లాలోని ప్రొద్దుటూరు కొత్తపల్లె చెక్‌పోస్టు దగ్గర అవినీతి నిరోదక శాఖ(ఏసీబీ) అధికారులు శనివారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా కడప డీసీటీవో వేణుగోపాల్, ఏసీటీవో శ్రీనివాసులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని విచారిస్తున్నారు.

Read More

కడప జిల్లాలో నేడు ఐదోరోజు జగన్‌ పాదయాత్ర

November 11, 2017

కడప: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్ర ఐదో రోజు శనివారం కడప జిల్లాలో జరగనుంది. ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరులో పాదయాత్ర కొనసాగనుంది. అలాగే సాయంత్రం ప్రొద్దుటూరులో బహిరంగ సభ జరగనుంది. ఇదిలా ఉండగా… ఏపీలో నేడు వైసీపీ పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టబోతోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో వైసీపీ నేతలు పల్లె నిద్ర చేసి వారివారి సమస్యలను తెలుసుకోనున్నారు.

Read More

“నదుల అనుసంధానం, పట్టిసీమపై ప్రజల్లో చైతన్యం తేవాలి”

November 10, 2017

అమరావతి: ఏపీలో జరిగిన నదుల అనుసంధానం, పట్టిసీమపై ప్రజల్లో చైతన్యం తేవాలని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. పట్టిసీమ ఫలాలు అనంతపురానికి కూడా అందుతాయని స్పష్టం చేశారు. ఏపీ ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉందని సీఎం ఈ సందర్భంగా తెలిపారు.     నదుల అనుసంధానంపై వాజ్‌పేయి హయాంలోనే సూచించామన్నారు. గోదావరిలో ఎక్కువగా నీరుంది.. కృష్ణా, పెన్నాలో నీరు లేదన్నారు. పట్టిసీమపై వైసీపీ చేసిన రాద్ధాంతం తనకింకా గుర్తుందని చంద్రబాబు […]

Read More

సాగర్ నీరు ఇవ్వాలని రైతుల రాస్తారోకో

November 10, 2017

గుంటూరు: నాగార్జున సాగర్ కుడికాల్వ ఆయకట్టు కింద వరిసాగుకు నీరు ఇవ్వాలని కోరుతూ నకరికల్లు అడ్డరోడ్డు దగ్గర రైతులు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ప్రస్తుతం సాగర్ లో నీరు పుష్కలంగా ఉన్నందుకు కుడికాల్వ ఆయకట్టుకు ప్రభుత్వం నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతూ వస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా… ప్రస్తుతం సీజన్ వస్తుండడంతో వరిపంట సాగుకు నీటిని విడుదల చేయాలని కోరుతూ రైతులు రాస్తారోకో నిర్వహించారు.

Read More

ఏపీ అసెంబ్లీలో స్వీట్లు పంచిన హోం మంత్రి

November 10, 2017

అమరావతి: ఏపీ అసెంబ్లీలోని తన చాంబర్లలో మంత్రులు, ఎమ్మెల్యేలకు హోం మంత్రి చినరాప్ప స్వీట్స్ పంచిపెట్టారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. అసెంబ్లీకి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలెవ్వరూ హాజరు కాలేదన్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ప్రశ్నోత్తరాల అనంతరం తన చాంబర్లో చినరాజప్ప సహచర మంత్రులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్వీట్లు పంచిపెట్టారు.     అయితే ఈ స్వీట్లు పంచడంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు చమత్కరించడం గమనార్హం. ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాలు జరుతున్నాయని హోం […]

Read More

పాతబస్తీలో పోలీసుల కార్డన్‌సెర్చ్‌

November 10, 2017

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఫలక్‌నుమా, వట్టేపల్లి, ఫాతిమానగర్‌లోని పలు ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. సౌత్‌జోన్‌ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ జరిగింది. దాదాపు 200 మంది పోలీసులు ఈ సెర్చ్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సరైన పత్రాలు లేని 40 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 17 మంది రౌడీషీటర్లతో పాటు… 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా… పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అన్వర్ […]

Read More
Social media & sharing icons powered by UltimatelySocial