రాజకీయం

చెమ్మగిల్లిన ముఖ్యమంత్రి కళ్ళు

March 14, 2018

               అమరావతి:  ఎప్పుడూ గంభీరంగా ఉండే ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కళ్లు చెమ్మగిల్లాయి. గొంతు వణికింది.స్వరంతోనే ప్రసంగం కొనసాగించారు. అంతలోనే తేరుకుని… ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయరని కేంద్రాన్ని నిలదీశారు. 

Read More

బంగ్లాదేశ్‌లో హిందూ గ్రామానికి నిప్పు

November 11, 2017

రంగ్‌పూర్: ఫోస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్ట్ చేసిందుకు ఆగ్రహించిన ఓ వర్గానికి చెందిన జనం ఓ హిందూ గ్రామంపై విరుచుకుపడ్డారు. నిప్పుపెట్టి, విధ్వంసం సృష్టించారు. లూటీ చేశారు. దీంతో సుమారు 30 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఆగ్రహించిన అల్లరిమూకను చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయి గోళాలు ప్రయోగించడంతో ఒక వ్యక్తి మరణించగా, సుమారు ఐదుగురు గాయపడ్డారు. బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్ సదర్ ఉపాజిలాలోని థాకూర్‌బరి గ్రామంలో ఈ ఘటన గత శుక్రవారంనాడు చోటుచేసుకుంది.     తకుబరి గ్రామానికి చెందిన […]

Read More

గర్భిణీలకు సామూహిక సీమంతాలు

November 11, 2017

హైరాబాబాద్: నగరంలోని చంపాపేట్ లోగల సామా నర్సింహారెడ్డి గార్డెన్‌లో శనివారం గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… నేడు ప్రభుత్వాసుపత్రుల్లో అనేక సౌకర్యాలను ప్రభుత్వం మెరుగుపరిచిందని, గర్భిణీలందరూ ప్రభుత్వ వైద్యశాలల్లోనే ప్రసవం చేయించుకొని కేసీఆర్ కిట్ పొందాలన్నారు.

Read More

జగన్ భద్రతా సిబ్బంది, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట

November 11, 2017

కడప: వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతా సిబ్బంది, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ప్రజా సంకల్పయాత్ర పేరిట జగన్ పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాదయాత్ర శనివారం కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం వద్దకు చేరుకుంది. అయితే… జగన్ దగ్గరకు వెళ్లేందుకు వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున వచ్చారు. దీంతో వారందరినీ జగన్ భద్రతా సిబ్బంది తోసేసారు. ఆగ్రహానికి గురైన వైసీపీ కార్యకర్తలు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో తోపులాట […]

Read More

ప్రార్థన సమయంలోనూ ఫోన్ల వాడకమేనా?

November 11, 2017

ఇక్కడకు వచ్చిన వేలాదిమంది సమక్షంలో నేను ప్రార్థనలు నిర్వహిస్తుంటే.. చాలామంది స్మార్ట్‌ ఫోన్లతో ఫొటోలు తీస్తున్నారు. ఈ సమయం పూజలకు మాత్రమే కేటాయించాలి.. ఫొటోలు తీయడానికి కాదు. సామాన్య భక్తులు మాత్రమే కాదు బిషప్పులు కూడా ఫోన్లతో ఫొటోలు తీయడంలో నిమగ్నమయ్యారు. ఇది చాలా బాధాకరం. ఫోన్లు పక్కన పెట్టండి..మానవత్వాన్ని పెంపొందించండి. – పోప్‌ ఫ్రాన్సిస్‌

Read More

వైసీపీ అధినేత జగన్ పై తిరుపతి పాస్టర్ సంచలన వ్యాఖ్యలు!

November 11, 2017

విగ్రహారాధన చేసిన జగన్ ని జీసస్ కచ్చితంగా శిక్షిస్తాడు విగ్రహారాధనను విడిచిపెడితే దేవుడు కచ్చితంగా జగన్ ని ముఖ్యమంత్రిని చేస్తాడు తిరుపతి చర్చిలో ఇటీవల తన ప్రసంగంలో పాస్టర్ డేవిడ్ వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్రను ప్రారంభించడానికి ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై క్రిస్టియన్ సంఘాలు మండిపడుతున్నాయి. క్రైస్తవుడిగా ఉన్న జగన్, శ్రీవేంకటేశ్వరుడిని పూజించడంపై కొందరు పాస్టర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహారాధన చేసిన జగన్ ని జీసస్ కచ్చితంగా […]

Read More

ఆంధ్రా కశ్మీర్‌లో పెరిగిన చలి తీవ్రత

November 11, 2017

విశాఖపట్టణం: ఆంధ్రా కశ్మీర్‌గా పిలవబడే విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లంబసింగిలో 9, చింతపల్లిలో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే మంచు మొత్తం దట్టంగా అలుముకుంటోంది. ఉదయం 10గంటలైనా సూర్యుడు కనిపించకుండా మంచు కప్పేస్తోంది. కాగా… కనీస ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చలికి వణికిపోతున్నారు. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు కూడా వస్తున్నాయని పలువురు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రతి ఏడాది డిసెంబర్ రెండవ వారం నుంచి […]

Read More

శ్రీవారి సేవలో హీరోయిన్ దీపిక

November 10, 2017

తిరుమల: బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొనే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న దీపిక వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీటీడీ అర్చకులు దీపికకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. దీపికను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు.

Read More

సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన ఎంఐఎం ఎమ్మెల్యే

November 10, 2017

హైదరాబాద్: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావును ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన మాట్లాడుతూ… ఇప్పటి వరకు ఏ సీఎం చేయని విధంగా సీఎం కేసీఆర్ ముస్లింలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. అలాగే ఉర్దూను సెకండ్ లాంగ్వేజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వాలు ఉర్దూని విస్మరించాయని, ఉర్దూ ట్రాన్స్‌లేటర్‌ పోస్టుల భర్తీ చేపట్టాలని నిర్ణయించడం సంతోషకరమన్నారు. అలాగే షాదీ ముబాకర్ ద్వారా పేద ముస్లింలను సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని పాషాఖాద్రి పేర్కొన్నారు.

Read More

పెళ్లి వేడుకల్లో విషాదం

November 10, 2017

రోడ్డు ప్రమాదంలో పెళ్లికుమార్తె పినతల్లి దుర్మరణం సరిహద్దు విషయంపై ఉత్కంఠ మూడు గంటల పాటు రోడ్డుపైనే మృతదేహం నాగలాపురం(చిత్తూరు జిల్లా): మరో 11 గంటల్లో వివాహ వేడుకలు జరుగనుండగా, పెళ్లి కుమార్తె పినతల్లి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషాద సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా..గురువారం నాగలాపురంలోని వర్తక సంఘం కల్యాణ మండపంలో శుక్రవారం వేకువ జామున కేవీబీ పురం మండలం కొత్త గొల్లకండ్రిగకు చెందిన ఓ యువకుడికి, పుత్తూరుకు చెందిన ఓ యువతికి […]

Read More
Social media & sharing icons powered by UltimatelySocial